HYD: ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ IHCL, నగరంలోని సోమాజిగూడలో కొత్త గేట్‌వే హోటల్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లు డి.శివరామరాజు, డీవీఎస్ సోమరాజులతో ఒప్పందం కుదుర్చుకుంది. 225 గదులతో నిర్మితమయ్యే ఈహోటల్లో అత్యాధునిక రెస్టారెంట్లు ఉంటాయి. దీంతో తెలంగాణలో IHCL హోటళ్ల సంఖ్య 8కి చేరగా, గేట్‌వే బ్రాండ్ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరనుంది.