KMM: ఎర్రుపాలెం మండలంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ మురళీమోహన్రావు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 421 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 42 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.