JGL: బుగ్గారం మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను గురువారం జిల్లా మేనేజర్ ఆశోద ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో మల్టీఛానల్ మానిటర్, AED, ఆక్సిజన్, అత్యవసర మందుల నిల్వలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య పరికరాల పనితీరు, రికార్డుల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.