WNP: జిల్లాలో ఎండలు నిప్పుల కొలుమిని తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తకోట మండలం కన్నాయిపల్లిలో 38.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. వెలుగొండ, ఆత్మకూరు 38.5°C, వీపనగండ్ల, వనపర్తి, గోపాల్ పేట 38.4°C, విలియంకొండ 38.3°C, మదనపూర్ 38.2°C, ఘనపూర్, పెద్దమందడి 38.1°C, కేతేపల్లి 38.0°C, శ్రీరంగాపూర్ 38.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.