VKB: నవాబ్‌పేట్ మండలంలోని గంగ్యాడ, పూలపల్లి, నారేగూడ, సిద్ధులూర్ గ్రామాలకు బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని చేవెళ్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ పామెన భీమ్ భరత్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. నిన్న హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా వికారాబాద్-సిద్ధులూర్ (వయా గంగ్యాడ) బస్సును వెంటనే ప్రారంభించాలని వారు విన్నవించారు.