బీజేపీ అగ్ర నేతలపై, కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా నిరూపించి చూపాలని కేటీఆర్ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ(Telangana) ఐటీశాఖ మంత్రి కేటీఆర్(IT minister KTR) ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ పాలనలో తప్పులుంటే బయటపెట్టాలని బీజేపీ(BJP) అధిష్టానానికి ఆయన సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పర్యటిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. నాగర్కర్నూల్ వేదికగా సోమవారం ‘నవ సంకల్ప సభ’ జరిగిందని, అందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ..బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని విమర్శించినట్లు గుర్తు చేశారు.
జేబులు నింపుకోవడం కోసమే ధరణి ఉందని, కుటుంబ పాలనతో రాష్ట్రం నష్టపోయిందని జేపీ నడ్డా(JP Nadda) మాట్లాడారని, రాష్ట్రానికి వచ్చి నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఊరుకునేది లేదన్నారు. కేంద్ర పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు నడ్డా చెప్పిన మాటల్ని ఇక్కడ ఎవ్వరూ నమ్మడం లేదన్నారు. నిజంగా తప్పు జరిగి ఉండుంటే బయటపెట్టాలని బీజేపీ అగ్ర నాయకులపై కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్(Congress) నాయకులపై కూడా మంత్రి కేటీఆర్(IT minister KTR) పెదవి విరిచారు. కాంగ్రెస్ నేతలు బీజేపీ(BJP)ని తిట్టడం లేదని, కాంగ్రెస్ నేతలపై కూడా దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులపై ఎంక్వైరీలు ఉండవని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు జరగవని, సోనియా(Somiya), రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఇంత వరకూ ఏ రకమైన ఎంక్వైరీలు ఎందుకు జరగలేదని కేంద్ర బీజేపీ నాయకులను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.