Harish Shankar: హరీష్ శంకర్ తో నితిన్ గడ్కరీ భేటీ.. మ్యాటరేంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం విజయ్ హిట్ థెరికి రీమేక్ కావడంతోపాటు శ్రీలీల కథానాయికగా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
హరీష్ శంకర్(Harish Shankar) తన స్నాప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పంచుకోవడం ద్వారా ఆశ్చర్యపరిచారు. నితిన్ గడ్కరీతో తన స్నాప్‌ను పంచుకుంటూ, “భారతీయ రహదారుల ఆధునిక రూపశిల్పి, ఎప్పుడూ భూమిపై ఉండే దూరదృష్టి గల నాయకుడు, శ్రీ @నితిన్_గడ్కరీ జీని కలవడం చాలా వినయంగా ఉంది. మీతో గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ (sir).” నితిన్ గడ్కరీతో ఆయన ఆకస్మిక భేటీ అనేక ఊహాగానాలకు తావిస్తోంది. నితిన్ గడ్కరీ చూపు టాలీవుడ్ పై బాగానే పడినట్లు తెలస్తోంది. గతంలో ఆయన ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత నితిన్ తో అయ్యారు.
ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ (Harish Shankar)ని భేటీ కావడం అందరిలోనూ ప్రశ్నలు మొదలౌతున్నాయి. ఇదిలా ఉండగా,ఉస్తాద్ భగత్ సింగ్‌లో అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటించారు.ఇందులో యంగ్ బ్యూటీ సాక్షి వైద్య ఓ కీలక పాత్రలో నటిస్తోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.