KMM: పేదల ముసుగులో నకిలీ పట్టాలతో లక్షలు వసూలు చేసిన వారిని వదిలేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల భూమి పూజ చేశారు. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వంటి సకల సౌకర్యాలతో కూడిన ఈ ‘ఆదర్శ ఇందిరమ్మ కాలనీ’ని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.