GNTR: అమరావతి ప్రాంతంలోని మందడం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. కలెక్టర్ల సమావేశం సమయంలో ఉన్నతాధికారులతో ఈ ఘటనపై చర్చించారు. ఇది యాదృచ్ఛికమా లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సూచించారు. నిర్మాణ సామాగ్రి, నిల్వ ఉన్న ప్రదేశంలో జరిగిన నష్టం, పరిస్థితులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులకు ఆదేశించారు.