AP: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ఉదయానికే విమానాశ్రయానికి చేరుకోవాల్సిన విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. మంచు కారణంగా ల్యాండ్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చే సర్వీస్ విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి.