»Prime Minister Modi Will Write 25 Acres Of Land To My 15th Son Madhya Pradesh
Modi: నా 15వ కొడుకు..25 ఎకరాల భూమి రాసిస్తా
నరేంద్రమోడీ(narendra modi) తనకు కొడుకులాంటి వారని ఓ వందేళ్ల బామ చెబుతోంది. అంతేకాదు తన పేరున 25 ఎకరాల భూమిని రాసిస్తానని అంటోంది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఓ 100 ఏళ్ల బామ్మ ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi)తనకు కొడుకు లాంటి వారని అంటోంది. మధ్యప్రదేశ్(madhya pradesh)లోని రాజ్‌గఢ్ జిల్లా హరిపురాకు చెందిన ఆ వృద్ధురాలు మంగీబాయి తన్వర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగీబాయికి 14 మంది పిల్లలు ఉండగా.. మోడీని తన 15వ కొడుకుగా భావిస్తున్నానని చెప్పింది. దేశానికి మోడీ ఎంతో సేవ చేస్తున్నాడని చెబుతోంది. అంతేకాదు తన కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నారని ప్రధానిని ప్రశంసించింది. ఆమె మోడీకి మాత్రమే ఓటేస్తానని తెలిపింది. తనతో పాటు దేశంలోని ఎంతో మంది వృద్ధుల అవసరాలను ప్రదాని తీరుస్తున్నారని ఆ బామ్మ మెచ్చుకుంది. అందుకే మోడీని తన 15వ కుమారుడిగా భావించి.. తనకున్న 25 ఎకరాల ఆస్తిని అతని పేరు మీద రాస్తానని మంగీబాయి వెల్లడించింది. వైరల్ అవుతున్న వీడియోలో మంగీబాయి చుట్టుపక్కల ఉన్న కొందరు మోడీని గుర్తుపట్టగలరా అని ప్రశ్నించగా..ప్రధాని ఫొటోను చూపించగా.. ‘అవును.. ఇతను మోడీ తనకు తెలుసని వెల్లడించింది.
ఆ క్రమంలో మోడీ తనకు ఇల్లు, ఉచిత వైద్యం, వితంతు పింఛన్ ఇస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని స్పష్టం చేసింది. ఆహారం అందించడంతోపాటు ఆయన వల్లే తాను తీర్థయాత్రలకు వెళ్లగలిగానని పేర్కొంది. అందుకే ప్రధానిని కొడుకుగా భావిస్తానని, అవకాశం దొరికితే స్వయంగా కలవాలనుకుంటున్నానని మంగీబాయి చెప్పింది. మంగళవారం మధ్యప్రదేశ్(madhya pradesh)లో ప్రధాని పర్యటించనున్న సందర్భంగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు(elections) జరగనున్న నేపథ్యంలో మోడీ తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. భోపాల్ రోడ్‌షోలో పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.