CTR: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. గ్రామీణ మహిళలకు విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు STW పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకంపై లోక్సభలో ప్రశ్నించగా కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు.