MBNR : జడ్చర్ల మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం స్థానిక MLA అనిరుధ్ రెడ్డి జడ్చర్ల విద్యుత్ శాఖ అధికారులు DE, AE, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గృహ సముదాయాలకు, వ్యవసాయ బోర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.