SRPT: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత, కృత్రిమ అభావంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రేపు కలెక్టర్లు, ఆయిల్ కంపెనీలతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.