కృష్ణా: కంకిపాడు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 5.75 కోట్లతో నిర్మించబోయే అదనపు గదులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పెనమలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించిన దాతలు అక్కినేని నాగేశ్వరరావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.