TG: రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. TGSRTC జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆయన్ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యలను సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.