VSP: పద్మనాభం మండలం గంధవరం గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామల, ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ధాన్యాలు, చిరుధాన్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.