ASR: డుంబ్రిగూడ ప్రభుత్వ హైస్కూల్లో గురువారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఛైర్మన్ చిట్టిబాబు బూడిదే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.