Pregnant Man: షాకింగ్..36 ఏళ్లు గర్భంతో ఉన్న పురుషుడు!
సంజు భగత్ అనే వ్యక్తి 36 ఏళ్లు తన కడుపులో పిండాన్ని మోశాడు. మొదట కడుపులో కణితి ఉందనుకున్న వైద్యులు ఆపరేషన్ చేయగా షాక్ అయ్యారు. సంజు భగత్‌కు ఇప్పుటు 60 ఏళ్లు అయినా అతన్ని అందరూ ప్రెగ్నెంట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు.
ఓ వ్యక్తి 36 ఏళ్లు గర్భం(Pregnant Man)తో ఉన్నాడు. తన కవల సోదరుడి పిండాన్ని ఆ వ్యక్తి మోశాడు. కడుపు భారీగా పెరగడంతో శ్వాస సరిగా తీసుకోలేకపోయాడు. అప్పుడే వైద్యులను సంప్రదించగా ఆ షాకింగ్ విషయం తెలిసింది. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. సంజు భగత్ అనే వ్యక్తి 1963లో జన్మించాడు. అతని 20 ఏళ్లు వచ్చే సరికి కడుపు పెరగడం మొదలైంది.
తన కడుపు పెరుగుతున్నా సంజు కూలీపనులకు వెళ్తూ జీవించేవాడు. తన తోటివారంతా అతన్ని గర్భవంతుడని(Pregnant Man) ఆటపట్టించేవారు. అయితే సంజు అవేవీ పట్టించుకోకుండా తన పనేదో తాను చూసుకునేవాడు. 30 ఏళ్లు వచ్చే సరికి అతని కడుపు ఇంకొంత పెరిగిపోయింది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కాస్త ఇబ్బంది పడేవాడు. ఏ పని చేసేందుకు అతనికి వీలయ్యేది కాదు. 1999లో ముంబైలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు.
మొదట సంజూకు స్కానింగ్ చేయగా కడుపులో కణితి ఉందనుకున్నారు. శస్త్ర చికిత్స చేయగా షాక్ అయ్యారు. సంజు కడుపులో మానవ శరీరం బయటపడింది. అవయవాలు, వెంట్రుకలు వచ్చాయి. సంజు కడుపులో నుంచి చనిపోయి ఉన్న శిశువు మృతదేహాన్ని బయటకు తీశారు. సంజు భగత్‌కు 60 ఏళ్లు వచ్చినా ఇప్పటికి కూడా అతన్ని ప్రెగ్నెంట్ మ్యాన్(Pregnant Man) అంటూ ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు తెలిపారు.