AP: బలమైన దేశానికి బలహీన ప్రధాని మోదీ అంటూ CPI నారాయణ విమర్శించారు. ‘యుద్ధం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చడమెందుకు.. తిరిగి అక్కడే పట్టాలు ఇవ్వడం ఎందుకు. భూదాన్ బాధితులందరికీ పట్టాలు ఇవ్వాలి. కమ్యూనిస్టులపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రభుత్వ బాధ్యత.. భిక్ష కాదు. కమ్యూనిస్టుల పోరాట ఫలితమే భూపంపిణీ’ అని పేర్కొన్నారు.