MBNR: జడ్చర్లలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్చురీ గదిని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్చురీ గదిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఎమ్మెల్యే సమీక్షించారు. అనంతరం మృతదేహాలను భద్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు.