ASF: రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో PACS మాజీ వైస్ ఛైర్మన్ రంగు మహేష్ గౌడ్ తండ్రి వేంకటి గౌడ్ జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన విలేజ్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ను MLA కోవ లక్ష్మి గురువారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణను, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.