ప్రకాశం: మోంథా తుఫాన్ బాధితులకు త్వరగా నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి డిమాండ్ చేశారు. తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన పటాన్ కాసింబి ఇల్లు ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇల్లు కూలింది. నేటికీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని, త్వరగా వారిని ఆదుకోవాలని గురువారం ఆయన ఎంపీడీవోను కలిసి వినతిపత్రం అందించారు.