AKP: జనసేన పార్టీ ఆశయాలను కార్యకర్తలు, నాయకులు ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాంబిల్లి మండలం వెంకటాపురం పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 14న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగురవేయాలని అన్నారు.