ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ గురువారం తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై వారు సుదీర్ఘంగా చర్చించారు. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వారు పలు సూచనలు చేశారు.