NDL: నంద్యాల మండలం అయ్యలూరుమెట్ట వద్ద ఉన్న SVR ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి పీ. భరత్ కుమార్ వీల్ చెయిర్ ఫెన్సింగ్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ఎం.డీ. దినేష్ రెడ్డి గురువారం తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ క్రమంలో విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.