KDP: తిరుమలలో గురువారం కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శంకర్, శేషారెడ్డి 20వ డివిజన్ ఇంఛార్జ్ శ్రీరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.