కృష్ణా: గుడివాడ రాజేంద్రనగర్లోని వైసీపీ కార్యాలయంలో 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మాట్లాడుతూ.. వైసీపీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత ఉత్సాహంగా తీసుకెళ్లేందుకు అందరూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలన్నారు.