అన్నమయ్య: అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సులో సీఎం నారా చంద్రబాబు పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాల ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు, టూరిజం, ఐటీ, ఎంఎస్ఎంఈలు వంటి రంగాలను ప్రోత్సహించాలని సీఎం తెలిపారు.