PDPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని 9వ వార్డులో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరుగురు స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో DMHO ప్రసాద్ పాల్గొన్నారు.