Ponguleti Srinivas Reddy and Jupally Krishna Rao joined the Congress on July 2
Ponguleti-Jupally: పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. వచ్చే నెల 2వ తేదీన ఇద్దరు నేతలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీద ఇద్దరు నేతలు, వారి అనుచరులు కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారట.
పొంగులేటి, జూపల్లితో చర్చలు పూర్తయ్యాయని, సీట్ల విషయంలో కూడా చర్చ జరిగిందని తెలిసింది. ఈ రోజు మధ్యాహ్నం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళతారు. పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తారు. తర్వాత అక్కడినుంచి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఇంటికి వెళతారు. ఈ నెల 25వ తేదీన పొంగులేటి, జూపల్లి ఢిల్లీ వెళతారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ప్రకటన చేస్తారు.
పొంగులేటి, జూపల్లితోపాటు (Ponguleti-Jupally) మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలో చేరతారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని మాట ఇచ్చిన తర్వాతే వీరు పార్టీలో చేరికపై స్పష్టత వచ్చింది. జూన్ 15వ తేదీ లోపు పార్టీలో చేరికకు సంబంధించి స్పష్టత వస్తోందని ఇదివరకే జూపల్లి కృష్ణారావు అన్నారు. పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు కూడా సంప్రందింపులు జరిపారు. కానీ సీట్ల లెక్కింపు, ఇప్పటికే బీజేపీలో చేరిన నేతలకు ప్రాధాన్యం లభించడం లేదని గుర్తించినట్టు ఉన్నారు. అందుకే బీజేపీని కాదని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.