ATP: కళ్యాణదుర్గం మండలం కడదరకుంటలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన దంపతులను MLA అమిలినేని సురేంద్ర బాబు గురువారం పరామర్శించారు. చిన్న గొడవను సాకుగా తీసుకుని భార్యాభర్తలపై అమానుషంగా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ ఆర్థిక సాయం అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.