ప్రముఖ హీరో భానుచందర్ (Bhanuchander) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు .. ఇంకా ఏం ఇవ్వలేదని నువ్వు బాధపడాలి. జీవితం (Life) చాలా చిన్నది .. ఈ కాసేపటికి ఇన్ని బాధలు పడుతూ కూర్చోవడం అవసరమా? మనశ్శాంతి ఉన్నవాడు గొప్పవాడు .. హాయిగా చనిపోయినవాడు అసలైన శ్రీమంతుడు”(Srimantudu) అని వెల్లడించారు. భానుచందర్ .. ఒకప్పుడు యాక్షన్ హీరో(Action hero)గా ఒక ఊపు ఊపేసిన హీరో. మార్షల్ ఆర్ట్స్ (Martial arts) నేపథ్యంలో నడిచే కథల్లో ఆయనే అసలైన నాయకుడు. అలాంటి భానుచందర్ ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు.
భగవంతుడు(Lord) ఆరోగ్యాన్ని ఇస్తాడు .. దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఇక ఎవరి జీవితంలోనైనా ఆరంభం కంటే ముగింపు ముఖ్యమైనదని ఆయన అంటూ ఉంటారు. లైఫ్లో మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటూ ఉంటాము .. కానీ మనల్ని తీసుకెళ్లే ఆయన మనలను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. కోట్లు సంపాదించేసి .. మంచంలో పడిపోయి .. ఎప్పుడు పోతాడ్రా అని అందరూ ఎదురుచూసేవరకూ ఉండకూడదు. నా ఫ్రెండ్ ప్రతాప్ పోతన్ మాదిరిగా నిద్రలో పోవాలంతే. బ్రతికినన్నాళ్లు మనశ్శాంతితో బ్రతకడం .. మనకి తెలియకుండానే మనం పోవడం” అంటూ చెప్పుకొచ్చారు.