Apple Watch: మహిళ ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్..ఎలాగంటే
నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా యాపిల్ వాచ్ తెలుపడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది.
యాపిల్ వాచ్(Apple Watch) ఓ మహిళ ప్రాణాలు కాపాడింది. గతంలో కూడా యాపిల్ వాచ్ వల్ల చాలా మంది ప్రమాదాల నుంచి బయటపడ్డారు. ఈ యాపిల్ వాచ్ నిరంతరాయంగా యూజర్ హార్ట్ రేట్ (Heart Rate)ను మానిటర్ చేస్తూ ఉంటుంది. ఏదైనా అసాధారణ మార్పులను గుర్తిస్తే అది ఆ యూజర్ ను అలర్ట్ చేస్తుంది. దీని వల్ల చాలా మంది కస్టమర్లు ప్రాణ ముప్పు నుంచి బయటపడినట్లు మీడియా ముఖంగా కూడా తెలియజేశారు.
తాజాాగా ఇటువంటి ఘటనే మరొకటి న్యూయార్క్ నగరంలో వెలుగులోకి వచ్చింది. యాపిల్ వాచ్(Apple Watch) తన ప్రాణాలు కాపాడిందని 29 ఏళ్ల మహిళ వెల్లడించింది. కిమ్మి వకిన్స్ అనే మహిళ నిద్రపోతుండగా ఆమె హార్ట్ రేట్(Heart Rate) వేగం పెరిగింది. దానిని యాపిల్ వాచ్ పసిగట్టి అలారం మోగించింది. ఆ మహిళకు నీరసంగా కూడా ఉండటంతో అలారం వల్ల మేల్కొంది.
చాలాసేపు హార్ట్ రేట్(Heart Rate) వేగం పెరుగుతూనే వచ్చింది. 10 నిమిషాల వరకూ హైరేట్ రావడంతో యాపిల్ వాచ్(Apple Watch) కిమ్మిని అలర్ట్ చేసింది. దీంతో కిమ్మీ వకిన్స్ వెంటనే దగ్గర్లోని డాక్టర్లను ఆశ్రయించింది. వైద్యులు పరీక్షలు చేసి ఆమె శరీరంలో ప్రాణాంతక బ్లడ్ క్లాట్ ఉందని తెలిపారు. పల్మనరీ ఎంబాలిజం తలెత్తే ప్రమాదం ఉందని సిన్సినాటి కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ బెకర్ తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స కొనసాగుతోంది. మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.