Viral: కొంత మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల వయసు కంటే పెద్దవారిగా కనిపిస్తే, మరికొందరు కష్టపడి పని చేస్తూ వయసుకు తగ్గట్టుగా కనిపిస్తారు. 60 ఏళ్లు వచ్చినా 20 ఏళ్ల అమ్మాయిలకు పోటీగా కనిపించే ఓ మహిళ గురించి తెలుసుకుందాం. 60 ఏళ్ల వృద్ధురాలు రోజూ జిమ్‌కి వెళ్లి గంటల తరబడి వర్కవుట్ చేస్తుంది. డైట్, జిమ్‌పై దృష్టి సారించే 60 ఏళ్ల మహిళ ఫిట్నెస్ చూస్తే మీరు షాక్ అవుతారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, మహిళ పేరు బావో షాలింగ్. ఆమె చైనాలోని ఓ నగరంలో నివసిస్తోంది. 38 ఏళ్ల వయస్సులో ఆమె ఫిట్నెస్ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె జిమ్, వర్కౌట్స్ చేయడం ప్రారంభించింది. తాను చాలా లావుగా మారానని, తన దుస్తులు సరిపోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అటువంటి పరిస్థితిలో ఆమె తన బరువు తగ్గించుకోవడానికి ఏరోబిక్స్ తరగతుల్లో చేరింది.
బావో షాలింగ్ ఉదయం 7 గంటలకు నిద్రలేస్తుంది. ఆమె ముందు వర్కవుట్లు చేస్తుంది. తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి.. హెల్తీ ఫుడ్, డైలీ వర్కౌట్ తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోంది. ప్రస్తుతం తన నడుం 27 అంగుళాలు, 20 ఏళ్ల వయసులో నడుము 25 అంగుళాలు ఉండేదని చెప్పింది. ఆమె వయస్సు 60 సంవత్సరాలు అయినప్పటికీ, ఆమె అక్కడ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంది. వర్కవుట్స్ చేస్తున్నప్పుడు కూడా ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని పేర్కొంది.