మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Power Star Ramcharan) భార్య ఉపాసన కొణిదెల(Upasana Konidela) రేపు బిడ్డకు జన్మనివ్వనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నివాసంలో మూడో తరం రాక కోసం రేపు శుభముహూర్తంగా తెలుస్తోంది. రామ్ చరన్, ఉపాసన దంపతులు తమ తొలి సంతానాన్ని రేపు స్వాగతించనున్నాయి.
ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రామ్ చరణ్, ఉపాసనలకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. ఇన్నాళ్లకు వారు తొలి బిడ్డకు జన్మనిస్తున్నారు. ఉపాసన గర్భవతి అని తెలిసినప్పటి నుంచే మెగా ఫ్యామిలీ(Mega Family)లో, అభిమానుల్లో సంతోషం ఉప్పొంగుతోంది.
ఆ మధ్య ఓ కార్యక్రమంలో ఉపాసన(Upasana Konidela) మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలని, ప్రస్తుతం ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉపాసన ప్రముఖ వ్యాపార వేత్త, ‘అపోలో హాస్పిటల్స్’ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు అని అందరికీ తెలిసిందే. చిన్న వయసు నుంచే ఉపాసన వ్యాపార లావాదేవీలను చూసుకుంటున్నారు. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చి తల్లి బాధ్యతలతో బిజీ కానున్నారు.