Pawan Kalyan కాకినాడలో పోటీ చేయు, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: చంద్రశేఖర్ సవాల్
పొలిటికల్‌గా పవన్ కల్యాణ్ జీరో అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైరయ్యారు. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తను ఓడిపేత రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నువ్వు ఓడిపోతే రాజకీయాలకు వీడ్కోలు పలుకుతావా అని ఛాలెంజ్ చేశారు.
Chandrasekhar Reddy: పొలిటికల్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జీరో అని ద్వారంపూడి చంద్రశేఖర్ ఫైరయ్యారు. నిన్న కాకినాడలో పవన్ కల్యాణ్ చంద్రశేఖర్‌పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రశేఖర్ ఈ రోజు కౌంటర్ అటాక్ చేశారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. ఆయనో ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. సీఎం కావాలి, ఎమ్మెల్యే కావాలి అని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని.. కానీ అదీ నెరవేరదన్నారు. ఓ సినిమా తీసి అందులో 175 అభ్యర్థులను పెట్టి, గెలిపించుకొని.. సీఎం కావాలని సూచించారు. తాగి తిట్టనని పవన్ చేసిన కామెంట్లను చంద్రశేఖర్ ప్రస్తావించారు. తాను మందు తాగానని.. సిగరెట్ కూడా ముట్టానని వివరించారు. కాఫీ, టీ తాగానని పేర్కొన్నారు. రియల్ లైఫ్ రాజకీయాల్లో సీఎం కాలేదన్నారు.
రూ.15 వేల కోట్ల..
గంజాయిని అరికట్టాలని కృతనిశ్చయంతో తాము ఉన్నామని చంద్రశేఖర్ తెలిపారు. చంద్రబాబు హయాంలోనే గంజాయి జోరుగా సఫ్లై జరిగిందన్నారు. కాకినాడలో రైస్ వ్యాపారంతో రూ.15 వేల కోట్లు సంపాదించాననే పవన్ విమర్శలను ఖండించారు. కాకినాడ పోర్టులో రూ.15 వేల కోట్ల ఎగుమతి కాలేదని పేర్కొన్నారు. తన వద్ద అంత డబ్బు లేదని.. అంత ఉంటే పవన్నే కొంటానని చెప్పారు. చంద్రబాబు ఎందుకు.. తనే కొనుగోలు చేస్తానని స్పష్టంచేశారు. కాకినాడలో అన్నీ కులాలకు సంబంధించిన అభ్యర్థిని తనేనని చంద్రశేఖర్ అంటున్నారు. అందరీ గుండెల్లో తాను ఉన్నానని తెలిపారు. 30 ఏళ్ల నుంచి తనతో ఉన్నారని వివరించారు. మీ వద్ద ఉన్న కొందరు తన వద్ద నుంచి వచ్చినవారేనని తెలిపారు.
దమ్ముంటే పోటీ చేయు
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో తిరగడం.. అనుచరులు ఇచ్చిన స్క్రిప్ట్‌తో మాట్లాడుతున్నారని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. సాయంత్రం గంటపాటు జనవాహిని కార్యక్రమం చేపడతారని తెలిపారు. 28వ వార్డులో జరిగిన ఘటనను ఉదహరించారు. తాను అనుకుంటే జనసేన బ్యానర్ కట్టనివ్వనని వివరించారు. 1989లో రాజకీయాల్లోకి వచ్చా.. అన్నీ కులాలు సమానం పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కులాల విభజన వచ్చిందన్నారు. 2024లో కులాల విభజన తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఇదీ చంద్రబాబు చివరి ఎన్నిక అని.. వయస్సు అయిపోయిందని చెప్పారు. ఓ జడ్జీ, మీడియా అధినేత రాజకీయాలు చేశానని పేర్కొన్నారు. కాకినాడలో దమ్ముంటే పోటీ చేయు అని చంద్రశేఖర్ కాదని అంటున్నారు. ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేదంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో అన్నారు. ద్వారంపూడిని డీ బ్యాచ్ అని పవన్ అనగా.. పవన్ కల్యాణ్‌ది పీ బ్యాచ్ అని చంద్రశేఖర్ విమర్శించారు. పీ అంటే ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకో అని సవాల్ విసిరారు.
జక్కంపూడి శిష్యుడిని
తాగుబోతు కుక్కలు, రాత్రి 1, 2 గంటల వరకు తాగితే నిద్రపట్టారు. సజెషన్ వల్లే మోరుగుతున్నారని చెప్పారు. ఆ వీర మహిళలు.. నటులు అని క్లిప్పింగ్స్ ఉన్నాయని తెలిపారు. పవన్ కల్యాణ్‌ది ఏ ఊరు.. తాను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా అని చంద్రశేఖర్ అన్నారు. పరిటాల రవి గుండు కొట్టించినప్పుడు ఏం చేశావని అడిగారు. పవన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న వ్యక్తి ఒక్కరు లేరు. రాజు రవి తేజతో కలిసి పుస్తకం రాసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు లేరని అడిగారు. 30 ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉన్నారు. రాజకీయాల్లో రంగా, జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడినని తాను అని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓరేయో పిచ్చోడా అని పలుమార్లు పవన్ కల్యాణ్‌ని దూషించారు.