CTR: జీడీ నెల్లూరులో మామిడి రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మామిడి పంటలో నాణ్యమైన దిగుబడి కోసం శాస్త్రీయ పద్ధతులు పాటించాలని సైంటిస్ట్ రామకృష్ణారావు సూచించారు. మామిడికి కవర్లు వాడితే చీడపీడల నివారణతో పాటు నాణ్యత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఉద్యానవన శాఖ సంచాలకులు కోటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కృష్ణమ నాయుడు పాల్గొన్నారు.