»Indonesia Open 2023 Satwik Chirag Pair Won Indonesia Open Title
Indonesia Open 2023 :ఇండోనేషియా ఓపెన్ టైటిల్ నెగ్గిన సాత్విక్-చిరాగ్ జోడీ
ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ అయిన సాత్విక్-చిరాగ్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ బంగారు పతకాన్ని సాధించింది.
ఇండోనేషియా ఓపెన్ టైటిల్(Indonesia Open 2023)ను సాత్విక్-చిరాగ్(Satwiksairaj-chirag shetty) జోడీ నెగ్గింది. జూన్ 18న ఆదివారం భారత డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ అయిన సాత్విక్ సాయి రాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు ప్రపంచ ఛాపింయన్స్(World Champions) అయిన మలేషియా ఆటగాళ్లు ఆరోన్ చియా, సోహ్ వూయ్ యిక్‌లతో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ విజయం ఢంకా మోగించారు.
ఇకపోతే ఇండోనేషియా ఓపెన్ వరల్డ్(Indonesia Open 2023) టూర్ సూపర్ 1000 టోర్నమెంట్లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి డబుల్స్ జోడి ఆటగాళ్లు మొదటిసారిగా ఫైనల్‌కు చేరకున్నారు. జకర్తా వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ జోడీ ఆసియా ఛాంపియన్స్ అయిన కాంగ్ మిన్-సియోంగ్ జేలపై విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో సూపర్ 1000 టోర్నమెంట్లో ఫైనల్స్‌కు చేరిన మొదటి భారతీయ జంటగా సాత్విక్-చిరాగ్(Satwiksairaj-chirag shetty) జోడీ నిలిచింది.
ఫైనల్ పోరు ఇండోనేషియాలోని జకార్తాలోని ఇస్టోరా గెలోరా బంగ్ కర్నోలో జరిగింది. మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ్ వూయ్ యిక్‌లతో సాత్విక్-చిరాగ్ జోడీ తలపడి విజయాన్ని నమోదు చేసింది. ఇండోనేషియా ఓపెన్ టైటిల్(Indonesia Open 2023) నెగ్గడంతో రికార్డు నెలకొల్పింది. ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్ అంటే సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇలా సింగిల్స్ ప్లేయర్ల పేర్లే అందరికీ గుర్తుకొచ్చేవి. అయితే ఇకపై డబుల్స్‌లోనూ మనవాళ్లు సత్తా సాధించారు. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి(Satwiksairaj-chirag shetty) అంతర్జాతీయ సర్క్యూట్లో తమదైనశైలిలో రాణిస్తూ విజయతీరాల వైపు సాగుతున్నారు.