»Shreyas Iyer As The New Captain Of The Indian Test Cricket Format
Indian Test cricket: ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ గా శ్రేయాస్?
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్(team india) ఓడిన తర్వాత రోహిత్ శర్మను భారత టెస్టు కెప్టెన్‌గా తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ గా ముగ్గురు యువ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.
భారత(indian) క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas iyer) గత రెండు నెలులుగా క్రికెట్ గ్రౌండ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతనికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా అతను IPL 2023లో కూడా భాగం కాలేకపోయాడు. అయితే ఈలోగా అతనికి ఒక గుడ్ న్యూస్ అందినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ టెస్టు జట్టులోకి వస్తాడని అంటున్నారు.
ఇటీవల ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 చివరి మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ(rohit sharma) కెప్టెన్సీపై అనేక కామెంట్లు వచ్చాయి. మరోవైపు అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రిషబ్ పంత్(Rishabh Pant) లేదా శుభ్‌మన్ గిల్(Shubman Gill)లు టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ శ్రేయాస్ అయ్యర్ సమక్షంలో వీరిద్దరూ కెప్టెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు.
నిజానికి శ్రేయాస్ అయ్యర్(Shreyas iyer) అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు మంచి కెప్టెన్సీ అనుభవం కూడా కలిగి ఉన్నాడు. అతను భారత జట్టు కోసం అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. విరాట్ కోహ్లి తర్వాత కెప్టెన్‌గా అవతరించే పోటీదారుగా నిలిచాడు. అయితే 2021లో గాయపడిన తర్వాత అతని కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అందుకే కెప్టెన్ కాలేకపోయాడు. ఇప్పుడు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అందుకే బీసీసీఐ అతడిని తదుపరి కెప్టెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.
28 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్(DC), కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. 2021లో గాయం కారణంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2022లో కోల్‌కతా నైట్రైడర్స్గా బాధ్యతలు చేపట్టాడు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ ప్లేఆఫ్స్, ఫైనల్స్‌కు చేరుకుంది. అతని నాయకత్వంలోని జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అటువంటి పరిస్థితిలో సెలెక్టర్లు అతనిని టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఎంచుకోవచ్చని సమాచారం.