»Satwik Chirag Pair Record To Reach Indonesia Open Final
Indonesia Open final: చేరి సాత్విక్-చిరాగ్ జోడి రికార్డు
భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి(Satwik Chirag) ఇండోనేషియా ఓపెన్(indonesia open 2023) సూపర్ 1000 టోర్నమెంట్లో ఫైనల్ దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సూపర్ 1000 టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు క్రియేట్ చేశారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి(Satwik Chirag)సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్(indonesia open 2023) సూపర్ 1000 టోర్నమెంట్లో ఈ జంట ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్స్‌లో సాత్విక్, చిరాగ్ జంట.. కాంగ్ మిన్ హ్యూక్, సియో సియెంగ్ జేపై విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోరులో 17-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో సూపర్ 1000 టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు సృష్టించింది. ఇక ఫైనల్ పోరు ఇండోనేషియాలోని జకార్తాలోని ఇస్టోరా గెలోరా బంగ్ కర్నోలో ఆదివారం (జూన్ 18) జరగనుంది. భారత డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి.. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లైన మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ్ వూయ్ యిక్‌లతో తలపడనున్నారు.
టోర్నీ ఆరంభం నుంచి సందడి చేసిన సాత్విక్, చిరాగ్ జోడీ సెమీస్(semis)లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి షాకిచ్చింది. ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోపై గెలిచారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో విక్టర్ అక్సెల్ సెన్ పై ఓటమి పాలయ్యారు. మరో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ లోనే ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో పతకం సాధిస్తుందని ఆశించిన పీవీ సింధు రెండో రౌండ్‌కు చేరుకోలేకపోయింది.