రామ్ చరణ్ తేజ 16వ మూవీలో హీరోయిన్గా నటించాలని సారా టెండూల్కర్‌ని అడిగారట దర్శక, నిర్మాతలు. ఒకవేళ ఆమె అంగీకరిస్తే.. అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
Ram Charan Tej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ (Ram Charan Tej) 16వ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఆ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. మూవీలో హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఓ సెలబ్రిటీ కూతురిని దర్శక, నిర్మాతలు సంప్రదిస్తున్నారని తెలిసింది.
ఆర్సీ 16 మూవీలో సారా టెండూల్కర్‌ను (sara) హీరోయిన్గా తీసుకోవాలని బుచ్చిబాబు భావిస్తున్నారని తెలిసింది. అందుకోసం ఆమెను సంప్రదించారని సమాచారం. బుచ్చిబాబు అడిగారట.. బట్ సారా, సచిన్ ఏ సమాధానం చెప్పారో తెలియడం లేదు. ఒకవేళ సారా అంగీకరించి.. సినిమాల్లో నటిస్తే క్రేజీ కాంబినేషన్ అవుతోంది.
సారా టెండూల్కర్ (sara) క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉందనే వార్త తెగ చక్కర్లు కొడుతుంది. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తోన్నాయి. ఇంతలో చెర్రీ సరసన హీరోయిన్ రోల్ అనే వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో రామ్ చరణ్ తేజ మూవీకి మరింత హైప్ వచ్చింది.