ODI WC 2023: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) ఫైరయ్యారు. బోర్డు తీరు సరిగా లేదని మండిపడ్డారు. వన్డే ప్రపంచ కప్ కోసం భారత్ వెళ్లేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే వెళ్తామని పీసీబీ చైర్మన్ నజం సేథి కామెంట్ చేశారు. అహ్మదాబాద్‌లో ఆడతామో లేదోనని అన్నారు. ఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది (Afridi) మండిపడ్డారు.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంది. మ్యాచ్ ఉండగా పీసీబీ ఇలా ప్రవర్తించడం సరికాదని ఆఫ్రిది (Afridi) అంటున్నాడు. అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఎందుకు ఆడరని పీసీబీని సూటిగా ప్రశ్నించారు. ఆ పిచ్‌పై ఆడకూడదని ఎందుకు అనుకుంటున్నారు..? అక్కడ నిప్పులు కురిపిస్తోందా..? లేదంటే వేటాడుతుందా అని అడిగారు. అక్కడ తప్పకుండా మ్యాచ్ ఆడాలి.. కానీ ఇలా కారణాలు చెప్పొద్దని అడిగారు.
భారత్ వచ్చి.. అక్కడ వారి సొంత మైదానంలో ఓడించడంపై దృష్టిసారించాలని కోరారు. ఏదైనా సరే సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని ఆఫ్రిది (Afridi) సూచించారు. ప్రేక్షకుల మధ్య విజయం సాధిస్తే ఆ మజానే వేరు అని అన్నారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు కాగా.. ప్రపంచ కప్ షెడ్యూల్ కన్ఫామ్ చేస్తారు. అక్టోబర్- నవంబర్ మధ్య వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది.