»Six Wickets In A Single Over 12 Year Old Boy Oliver White House Record
Six wickets: ఒకే ఓవర్లో ఆరు వికెట్లు..12 ఏళ్ల బుడ్డోడి సరికొత్త రికార్డు
ప్రస్తుతం క్రికెట్ ఆటకోసం ఎంతమంది వీరాభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ వరకు ప్రతిదానిని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ క్రమంలో అంతర్జాతీయ, దేశీయ లేదా స్థానిక టోర్నమెంట్లలో అనేక రికార్డులు కూడా క్రియేట్ అవడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాంటిదే చోటుచేసుకుంది. ఓ 12 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించుకున్నాడు.
ప్రతిసారీ క్రికెట్లో అనేక రికార్డులు నమోదు కావడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక బౌలర్ హ్యాట్రిక్ సాధించడం చాలా అరుదు. కానీ ఇటీవల ఓ 12 ఏళ్ల బాలుడు ఒకే ఓవర్లో ఆరు వికెట్లు పడకొట్టి రెండు హెట్రిక్స్ సాధించాడు. ఈ 12 ఏళ్ల జూనియర్ ఆటగాడు ఆలివర్ వైట్‌హౌస్(oliver white house) కుక్హిల్పై బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తరపున ఆడిన ఆటలో భాగంగా కూక్ హిల్ జట్టుపై ఈ ఫిట్ నమోదు చేశాడు. వైట్‌హౌస్ ఆరు బంతుల్లో ఆరుగురు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఔట్ చేశాడు. దీంతోపాటు రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
ఈ సందర్భంగా తాను ఒక ఓవర్(single over)లో ఆరు వికెట్లు తీశానని నమ్మలేకపోయానని వైట్‌హౌస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఇది తెలిసిన పలువురు ఈ కుర్రాడిని తెగ మెచ్చుకుంటున్నారు. అతను పెద్దవాడైన తర్వాత ఇంకా బాగా ఆడతాడని అంటున్నారు. తన ఫీట్ నమ్మశక్యం కానిదిగా ఉందని అభివర్ణిస్తున్నారు. దీంతోపాటు పలువురు నెజిటన్లు కూడా ఈ అబ్బాయిని తెగ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది వెల్ డాన్ అంటూ పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.