»Icc World Cup Qualifiers 2023 World Cup Qualifiers From June 18 Competition Between 10 Teams
ICC World Cup Qualifiers 2023: జూన్ 18 నుంచి వరల్డ్ కప్ క్వాలిఫయర్స్..10 జట్ల మధ్య పోటీ
భారత్లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్ కోసం మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్ కు చేరిన 2 జట్లు మాత్రం ప్రపంచ కప్ కు అర్హత సాధించనున్నాయి.
భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ 2023(ICC World Cup) జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఆ షెడ్యూల్ కంటే ముందుగా జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ల గురించి ప్రణాళిక రెడీ అయ్యింది. జూన్ 18 నుంచి జులై 9వ తేది వరకూ జింబాబ్వేలో ఈ క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఈ 10 జట్లలో తుది జాబితాలోకి రెండు జట్లు మాత్రమే చేరతాయి.
వరల్డ్ కప్(ICC World Cup)లో భారత్ జట్టుతో కలిపి మొత్తం 8 జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. ఆ మిగిలిన 2 స్థానాలకు మాత్రం క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. వాటిలో జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, అమెరికా, UAE జట్లు ఉండగా వాటిని రెండు గ్రూపులు చేశారు. గ్రూప్-ఎలో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా జట్లు ఉన్నాయి. ఇకపోతే గ్రూప్ బిలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి.
క్వాలిఫయర్స్ రౌండ్(Qualifiers Round)లో పాల్గొనే 10 జట్ల మధ్య ఫైనల్(Final)తో సహా మొత్తం 34 మ్యాచ్లు నిర్వహించనున్నారు. రెండు గ్రూపు(2 Groups)ల్లోని జట్లు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుండగా జూన్ 29 నుంచి సూపర్-6 మ్యాచ్లు సాగనున్నాయి. చివరగా ఫైనల్కు చేరిన 2 జట్లు ప్రపంచ కప్(ICC World Cup)లో ఆడే అర్హతను సాధించనున్నాయి.