»98 Dead In Up Bihar 98 People Died In 3 Days Due To Sunburn
98 dead in UP-Bihar: వడదెబ్బకు 3 రోజుల్లో 98 మంది మృతి
ఇండియాలో భారీ ఎండలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలకు గత మూడు రోజుల్లో 98 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇండియా(India)లో ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆ మూడు రోజుల్లో విపరీతమైన వేడిగాలుల(HeatWaves)కు భరించలేక 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అధికారులే ప్రకటించారు. గత మూడు రోజుల్లో వేడిగాలులకు(Extreme Heatwave), ఉక్కపోతలకు తట్టుకోలేక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 54 మంది, బీహార్ రాష్ట్రంలో 44 మంది మరణించారు.
దేశవ్యాప్తంగా తీవ్ర ఎండల(High Temperatures)కు ప్రజలు జ్వరం, వడదెబ్బ బారిన పడుతున్నారు. శ్వాస ఆడకపోవడం వల్ల ఆరోగ్య సమస్య(Health Problems)లతో 400 మంది ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రంలోని బలియా జిల్లాలోని ఆస్పత్రిలో చేరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్(Jayanth Kumar) వెల్లడించారు. వడదెబ్బకు గురైన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడినవారే కావడం గమనార్హం.
యూపీలో జూన్ 15న వడదెబ్బకు 23 మంది, 16న 20 మంది, 17న 11 మంది ప్రాణాలు విడిచారు. ఇంకా పెద్ద సంఖ్యలో రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. రాబోయే 5 రోజుల్లో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన హీట్‌వేవ్(HeatWaves) పరిస్థితులు కొనసాగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. ఒడిశా, జార్ఖండ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, బీహార్, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో మరో మూడు రోజులు భారీ ఎండలు ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert)ను జారీ చేసింది.