»Indians Can Visit These Countries Without Visa 26 Countries 2023
Indians: ఈ దేశాలకు వీసా లేకుండానే ఫ్రీగా వెళ్లొచ్చు
మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు వీసా లేదా? అయినా కూడా నో ప్రొబ్లాం. వీసా లేకున్నా కూడా భారతీయులు(indians) పలు దేశాలను సందర్శించవచ్చు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
భారతీయులు(indians) విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనేక మంది అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడే వ్యక్తులు ఎల్లప్పుడూ సందర్శించడానికి ఏదో ఒక దేశం కోసం వెతుకుతూనే ఉంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసా లేకపోయినా కూడా భయపడాల్సిన పనిలేదు. వీసా(visa) లేకుండా కూడా భారతీయులు సందర్శించగలిగే అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. మీరు మీ పాస్‌పోర్ట్‌తో ఒక నెల నుంచి మూడు నెలల వరకు హాయిగా తిరగవచ్చు. వీసా లేకుండా భారతీయ పర్యాటకులు ప్రవేశించే కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేపాల్
ఇండియా పొరుగుదేశాలైన నేపాల్‌కు రోడ్డు, రైలు, వాయుమార్గం ద్వారా వెళ్ళవచ్చు. ఇండియా నుంచి నేపాల్‌లోని ఖాట్మండుకు విమాన సర్వీసులు ఉన్నాయి. భారతీయులకు నేపాల్ వెళ్లాలంటే వీసా అవసరం లేదు. మీ భారతీయ పౌరసత్వం కల్గిన ఐడీ కార్డ్ ఉంటే చాలు.
భూటాన్
భారతదేశం పొరుగు దేశం భూటాన్ వెళ్లాలన్నా కూడా వీసా అక్కర్లేదు. భూటాన్ అందమైన కొండలు, మైదానాలకు ప్రసిద్ధి చెందింది. ఇది పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం. భూటాన్‌ను సందర్శించేందుకు భారతీయులకు వీసా అవసరం లేదు.
మారిషస్
ఇండియన్స్ వీసా లేకుండా ప్రయాణించగల దేశాలలో మారిషస్ కూడా ఒకటి. మారిషస్ భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ దేశంలో 90 రోజుల వరకు ఎలాంటి వీసా లేకుండా పర్యటించవచ్చు.
ఫిజీ
భారతీయులు వీసా లేకుండా ప్రయాణించడానికి అవకాశం ఉన్న్ మరొక మంచి టూరిస్ట్ దేశం ఫిజీ. ఇక్కడ వీసా లేకుండా 120 రోజుల వరకు ఉండవచ్చు. ఇది చిన్నదేశమే అయినా కూడా టూరిస్ట్ స్పాట్ అడ్డాగా ఈ దేశం ప్రసిద్ధి చెందింది.
దీంతోపాటు మరికొన్ని దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చుద్దాం.
1. అల్బేనియా 14. మారిషస్
2. బార్బడోస్ 15. మైక్రోనేషియా
3. భూటాన్ 16. మోంట్సెరాట్
4. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ 17. నేపాల్
5. కుక్ దీవులు 18. నియు
6. డొమినికా 19. ఒమన్
7. ఎల్ సాల్వడార్ 20. ఖతార్
8. ఫిజీ 21.సెనెగల్
9. గ్రెనడా 22. సెయింట్ కిట్స్ మరియు నెవిస్
10. హైతీ 23. సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్
11. జమైకా 24. ట్రినిడాడ్ మరియు టొబాగో
12. కజకిస్తాన్ 25. ట్యునీషియా
13. మకావో (SAR చైనా) 26. వనౌతు