AKP: నర్సీపట్నం ఐదు రోడ్లు జంక్షన్లో గల జడ్పీ హైస్కూల్లో గురువారం పదో తరగతి విద్యార్థులకు విశ్రాంతి ఉపాధ్యాయులు అప్పలస్వామి స్టడీ మెటీరియల్, హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు తెచ్చుకునే విధంగా చదువుకోవాలని సూచించారు. గత పరీక్షలు తాలూకా ప్రశ్న పత్రాలను రివైజ్ చేసుకోవాలని పేర్కొన్నారు.