విశాఖలో పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్ -1’ మొబైల్ యాప్‌ను రూపొందించామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన వివరించారు. వార్డు, సచివాలయ డేటాను విశ్లేషించి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని అన్నారు. ఏఐ చాట్‌బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసి సర్వీస్ నంబర్ ఇస్తామన్నారు.