అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. గతంలో ముంబై విమానాశ్రయంలో ధనుష్ తన దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం ఫ్రాంచైజీకి రెండు అదనపు సీక్వెల్స్ ఉన్నాయని తెలుస్తోంది.
తమిళ హీరో ధనుష్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన ఎంపిక చేసుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయి. ఒక్క జోనర్‌కే పరిమితం కాకుండా రకరకాల జోనర్లను టచ్ చేస్తూ ప్రయోగాత్మకంగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే, ఆయనకు ఒక మంచి నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. చివరగా ఆయన సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం ధనుష్ దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మేకర్స్ మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో పార్ట్ కూడా ఒక్కో కాలంలో ఉంటుందని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ 1940టైంలో, రెండో పార్ట్ 1990 కాలంలో ఆఖరిది ప్రస్తుత కాలంలో ఉంటుందని సమాచారం. జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.